అవసరమైతే మళ్లీ కెసిఆర్ దీక్ష: ఎమ్మెల్యే కెటిఆర్

తెలంగాణ ప్రాంత మంత్రులకు ఆత్మ గౌరవం లేదు కాబట్టే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నిరవధిక సమ్మెకు పిలుపునిస్తే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జెఏసి ఏ నిర్ణయం తీసుకన్నా కట్టుబడి ఉంటామని చెప్పారు. తెలంగాణ ప్రాంత తెలుగుదేశం, కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు కలిసి వస్తే రాజకీయ సంక్షోభం సృష్టించి తెలంగాణ తీసుకు వస్తామన్నారు. తమ వద్ద తెలంగాణ సాధన కోసం బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని వాటిని ప్రయోగిస్తామని చెప్పారు. వాటిని ముందు ముందు ప్రయోగిస్తామని హెచ్చరించారు. బస్సులు, ఆటోల బందు వల్ల రాష్ట్రానికే పరిమితమైన తెలంగాణ ప్రజల ఆకాంక్ష రైలు రోకోతో దేశానికి మొత్తానికి పంపినట్లయిందన్నారు.












Click it and Unblock the Notifications