ఇక చాలు! ఇప్పటికే తెలిసింది: రైలు రోకోపై కోదండరాం

అయితే పండుగలు ఉన్నందున చాలామంది ప్రజలు ప్రయాణాలు పెట్టుకుంటారన్నారు. అలాగే ముందుగా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. అయితే పరిస్థితిని బట్టి మరోమారు నిరవధిక రోకోకు దిగుతామని చెప్పారు. రాజకీయంగా ఇది బలమైన అస్త్రం కాబట్టి కేంద్రం దిగి రాకుంటే మళ్లీ చేపట్టే నిర్ణయం తీసుకుంటామన్నారు. రైలు రోకో కార్యక్రమంలో బిజెపి, టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారని చెప్పారు.
కాగా కోదండరామ్, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావుతో పాటు పలువురు తెలంగాణవాదులు ఈ రైలు రోకోలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఓ పోలీసు వీడియోతో చిత్రీకరిస్తుండగా ఆగ్రహించిన తెలంగాణవాదులు పోలీసుపై దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications