చిరంజీవి ఇప్పటికీ మారలేదు!: ఎమ్మెల్యే కెటిఆర్

తెలంగాణ ప్రాంతంలో పదమూడు రోజులుగా ఉద్యమం జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రజలు కాదా అన్నారు. ఆయన త్వరలో అమావాస్య చంద్రుడు కాక తప్పదన్నారు. చిరంజీవి విలీనం తర్వాత కూడా సమైక్యాంధ్ర పాటే పాడుతున్నారని విమర్శించారు. జెఏసి నిరవధిక రైలు రోకోకు పిలుపునిస్తే సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా రైలు రోకో కార్యక్రమం అనంతరం మౌలాలీలో ఇద్దరు యువకులు సెల్ టవర్ ఎక్కడంతో కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. కెటిఆర్, దత్తాత్రేయ, కోదండరామ్ వారిని దిగి రావాల్సిందిగా కోరారు. టవర్ ఎక్కిన ఓ మహిళా బంధువు అదే టవర్ పైకి ఎక్కి వారిని ఒప్పించి కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications