సోనియాతో భేటీ, రాజీనామాకు చిదంబరం రెడీ?

కాగా, అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన ప్రణభ్ ముఖర్జీ కూడా సోనియాను కలిశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులపై తన మంత్రిత్వ శాఖ ప్రధానికి రాసిన లేఖపై చెలరేగిన దుమారంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. తాను చెప్పాల్సింది ఆదివారమే చెప్పానని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై తన మంత్రిత్వ శాఖ రాసిన లేఖపై వివరణ ఇవ్వడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ప్రధాని అమెరికా నుంచి మంగళవారం తిరిగి వచ్చిన తర్వాత అది ఉంటుందని ఆయన చెప్పారు. చిదంబరం తనకు విలువైన సహచరుడని ప్రణబ్ అన్నారు.
చిదంబరం పాత్రపై ఎ రాజా న్యాయవాది కూడా సోమవారం కోర్టులో మాట్లాడారు. చిదంబరానికి అన్ని విషయాలూ తెలుసునని ఆయన అన్నారు. చిదంబరాన్ని కోర్టుకు పిలిపించి అడిగితే వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications