తెలంగాణ అప్పగించండి చూసుకుంటాం: సీమ నేతలు

రాయలసీమను రెండుగా విభజిస్తే ఖబర్దార్ అని టిడిపి మరో నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ అంశం బాధ్యతను మాకు అప్పగిస్తే మేం చూసుకుంటామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేలా చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాయలసీమను ఆరో జోన్‌లో కలపాలనుకోవడం సరికాదన్నారు. కాగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణ ప్రాంతంలో కలుపుతూ రాష్ట్రాన్ని విభజిస్తామనే ప్రతిపాదనలు వస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో సీమ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications