బెజవాడ దీక్షపై లగడపాటి వర్సెస్ వైయస్ జగన్

YS Jagan-Lagadapati Rajagopal
విజయవాడ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, కడప పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. రైతు సమస్యలపై అక్టోబర్ 1వ తేదిన రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడలో ఒక్క రోజు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జగన్ తన దీక్ష వేదికను మార్చుకోవాలని లేఖ రాశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రైతు దీక్ష వేదికను మరో ప్రాంతానికి మార్చుకుంటే బావుంటుందని అన్నారు. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లేందుకు దీక్షను బెజవాడ నుండి మరో ప్రాంతానికి మార్చుకోవాలని గాంధీగిరి పద్ధతిలో లేఖ రాశానని చెప్పారు.

అయితే లగడపాటి విజ్ఞప్తిని వైయస్సార్సీ పార్టీ నేతలు తోసిపుచ్చుతున్నట్టుగా తెలుస్తోంది. జగన్ దీక్ష వేదిక మార్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దీక్షకు మరో రోజు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో లగడపాటి దీక్షను మార్చుకోవాలని కోరటం, వైయస్సార్సీ పార్టీ నేతలు ససేమీరా అనడంతో విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇరు ప్రాంతాలు తమ బలాబలాలు నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. జగన్ దీక్షా శిబిరానికి భారీగా జనాలను తరలించే ప్రయత్నాలను వైయస్సార్సీ పార్టీ చేస్తుండగా, దానిని అడ్డుకునే ప్రయత్నంలో లగడపాటి అనుచరులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా కృష్ణా జిల్లాలో జగన్ ఓదార్పు చేపడుతున్న విషయం తెలిసిందే. అంతకుముందు లగడపాటి జగన్‌పై నిప్పులు చెరిగిన నేపథ్యంలోనే ఆయన తన ఓదార్పును కృష్ణా జిల్లాలో ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా లగడపాటి ఇలాకాలో జగన్ దీక్ష చేస్తానని ప్రకటించడంతో దాన్ని అడ్డుకొని తన సత్తా చాటాలని ఎంపీ చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+