గాలి ఆడిటర్ రుక్మిణి, సెక్రటరీలపై లుకౌట్ నోటీసు

గాలి అక్రమ మైనింగుకు సంబంధించిన లావాదేవీలు, పంపకాలు, డబ్బు పంపిణీ తదితరాలు వీరు దగ్గరే ఉండి చూసుకునే వారని సిబిఐ దర్యాఫ్తులో తేలింది. గాలికి ప్రధాన అనుచరులుగా ఉన్న స్వస్తిక్ నాగరాజు, మహేష్‌లు అజ్ఞాతం వీడి బయటకు వచ్చాక రుక్మిణీ తదితరులు సైతం వస్తారని సిబిఐ భావించినట్లుగా తెలుస్తోంది. అయితే వీరు ఇప్పటికీ అజ్ఞాతం వీడి బయటకు రాక పోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అక్రమ మైనింగులో ముడుపులు ఎవరెవరికి అందాయనే అంశం తేల్చాలన్నా వారు బయటకు రావాల్సిందేనని సిబిఐ భావిస్తోంది. కాగా కర్నాటకలోని 40 గనులకు లైసెన్సులు రద్దు చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications