వైయస్ జగన్ గూటికి చేరిన వంగవీటి రాధాకృష్ణ

ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి చాలా ముందు రోజుల నుంచే రాధాకృష్ణ చిరంజీవికి దూరంగా ఉంటున్నారు. చిరంజీవి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. విజయవాడ రాజకీయాల సమీకరణాల నేపథ్యంలో ఇటు కాంగ్రెసులోనూ అటు తెలుగుదేశంలోనూ ఇమిడే పరిస్థితి లేకపోవడంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఆ మధ్య విజయవాడ పర్యటలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంగవీటి మోహనరంగా విగ్రహానికి నివాళులు అర్పిస్తారని భావించారు. కానీ, బొత్స అటువైపు వెళ్లలేదు. దీంతో కాంగ్రెసుపైన కూడా వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తి చెందారు.












Click it and Unblock the Notifications