విజయవాడలో ధర్నాకు దిగిన వైయస్ జగన్

YS Jagan
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు సమస్యలపై శనివారం ఉదయం విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. జగన్ రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా లెక్క చేయకుండా ఆయన ధర్నాకు పూనుకున్నారు. అంతకు ముందు ఆయన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ - ఎన్ని కష్టాలు ఎదురైనా రైతులకు బాసటగా నిలుస్తానని చెప్పారు.

ఆయనతోపాటు శాసనసభ్యులు శివప్రసాద్ రెడ్డి, ప్రసాద రాజు, రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, సామినేని ఉదయభాను కూడా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అక్కడి నుంచి ధర్నా స్థలికి చేరుకోవడానికి ముందు జగన్ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ధర్నాలో వంగవీటి రాధాకృష్ణ, వై గోపాల రెడ్డి కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+