కెసిఆర్, కోదండరామ్‌లపై నెపం నెట్టిన ముఖ్యమంత్రి

కీలకమైన దశలో పంటలకు నీరందకుండా చేసి రైతుల ఉసురు పోసుకోవద్దని ఆయన కెసిఆర్, కోదండరామ్‌లకు సూచించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసిని శ్రమపడి లాభాల బాట పట్టించామని, సమ్మె వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని ఆయన అన్నారు. విధుల్లోకి రావాలని ఆయన సింగరేణి కార్మికులను, ఆర్టీసి ఉద్యోగులను కోరారు. తెలంగాణకు ఎవరూ వ్యతిరేకం కాదని, నిర్ణయం వచ్చే వరకు సహనం వహించాలని ఆయన సూచించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications