రాష్ట్ర విభజనపై నేను తటస్థుడిని: చంద్రబాబు

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఉద్యోగులు 45 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చారని, అయినా ప్రత్యామ్నాయాలు కల్పించడంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కొంత మంది ఉద్యమిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. విద్యుత్తు సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర పరిస్థితులకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులను తొలగించాలని ఆయన ఆయన కోరారు. తెలంగాణపై నిర్ణయం తెలియజేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications