ప్రణబ్ ముఖర్జీపై తెలంగాణ కాంగ్రెసు ఎంపీల ధ్వజం

చిన్న రాష్ట్రాల నివేదికను కేంద్రానికి ఇచ్చిన ప్రణబ్ తెలంగాణపై ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని పెద్దపల్లి శాసనసభ్యుడు వివేక్ హైదరాబాదులో అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం చేర్చింది కూడా కాంగ్రెస్సే అన్నారు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు ప్రత్యేక రాష్ట్ర ఉద్దేశ్యంతో పెట్టుకున్నదే అన్నారు. పార్టీలో ఉండాలో లేదే మరోసారి ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటామని చెప్పారు. తెలంగాణను గూర్ఖాలాండ్‌తో పోల్చవద్దని మరో నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి సూచించారు. తెలంగాణ కోసం జరుగుతున్న తరహా ఉద్యమం మరెక్కడా జరగలేదన్నారు. తెలంగాణ ఇస్తేనే రాష్ట్రంలో పార్టీ బతుకుతుందని లేదంటే తాము గ్రామాలలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు.












Click it and Unblock the Notifications