ప్రత్యేక తెలంగాణతో సమస్యలు: ప్రణబ్ ముఖర్జీ

Pranab Mukherjee
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం చాలా క్లిష్టమైనదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం న్యూఢిల్లీలో జాతీయ మీడియాతో అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైందన్నారు. ప్రత్యేక రాష్ట్ర వాదం తెలంగాణలో యాభయ్యారేళ్లుగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని పార్టీలలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. కేవలం ప్రాంతాల మధ్యనే విభేదాలు ఉన్నాయన్నారు. అనాలోచితంగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మరికొన్ని కొత్త రాష్ట్రాల డిమాండ్ తెరపైకి వచ్చే ఆస్కారం ఉందన్నారు. సమస్య పరిష్కారం అంత ఈజీ కాదన్నారు. నిర్ధిష్ట కాల వ్యవధిలో పరిష్కారం కష్టమన్నారు. రాష్ట్రాల ఏర్పాటుకు నిర్దిష్ట ప్రాతిపదిక లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఇటీవలె ఢిల్లీలో ముఖ్య నేతలను కలవడం, నిరవధికంగా జరుగుతున్న సకల జనుల సమ్మె కారణంగా తెలంగాణ అంశం జాతీయ స్థాయిలో మరోసారి వేడెక్కింది. తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మినహా మిగిలిన పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయి. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐలు తెలంగాణకు అనుకూలంగా ఉండగా, సిపిఎం సమైక్యాంధ్రకే మొగ్గు చూపింది. అయితే రెండు ప్రాంతాలలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ వైఖరితో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వైఖరిలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. మంగళవారమే మీడియా సమావేశంలో టిడిపి చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణపై తనది తటస్థ వైఖరి అని ప్రకటించారు. ఇక కాంగ్రెసు పార్టీ మరి కొన్ని రోజుల్లో వైఖరి ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+