కన్నడ నటుడు దర్శన్‌కు షరతులతో బెయిల్

బెయిల్ కోసం దర్శన్ 25 వేల రూపాయల బాండ్‌తో కూడిన వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారు. గత 29 రోజులుగా దర్శన్ జైలులో ఉన్నారు. తాజా పరిణామం తనకు సంతోషాన్నిస్తోందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాబోవని తాను దర్శన్ మిత్రులకు, అభిమానులకు హామీ ఇస్తున్నానని విజయలక్ష్మి అన్నారు. క్షమించాలని వారిని తాను కోరుతున్నట్లు ఆమె తెలిపారు. పరిణామాలు ఇంత తీవ్ర స్థాయికి వెళ్తాయని అనుకోలేదని, తన భర్తను ఇంటికి ఆహ్వానించడానికి ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications