రాష్ట్రపతి పాలన ప్రసక్తే లేదు: ఆజాద్ స్పష్టీకరణ

ghulam nabi azad
న్యూఢిల్లీ: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన విధిస్తారనే అంశం ఎందుకు ముందుకు వస్తోందని ఆయన మీడియా ప్రతినిధులను అడిగారు. శనివారం ఉదయం పూట తెలంగాణపై మినీ కోర్ కమిటీ చర్చల అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో పరిష్కారం వస్తుందని అనుకోరాదని, అలా ఎందుకనుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై మరింత విస్తృత స్థాయి చర్చలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ సమస్యపై ఇది వరకు మాట్లాడనివారందరితో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన నలుగురు మంత్రులతో, ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడామని ఆయన చెప్పారు. ఈ విస్తృత స్థాయి చర్చలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చెందిన మూడు ప్రాంతాల ప్రజాప్రతినిధులతో చర్చలు పూర్తి చేశామని ఆయన అన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామని ఆయన అన్నారు. సమస్యను పరిష్కరించే దిశగానే చర్చలు సాగిస్తున్నామని ఆయన అన్నారు. మినీ కోర్ కమిటీతో మాట్లాడిన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అంశం తమ వద్ద ప్రస్తావనకు రాలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+