లగడపాటిపై కేసెందుకు పెట్టరు: సిఎంకు కోదండరామ్

సకల జనుల సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణ ఆర్టీసి కార్మికులు సమ్మె విరమిస్తే బస్సులు ఎక్కడ తిరుగుతున్నాయో చెప్పాలన్నారు. త్వరలో తెలంగాణపై ఓ నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులను రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం స్వస్తీ పలకాలన్నారు. అందరూ కలిసుండాలని చెబుతున్న మాపై కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం బలహీనపడిందని పోలీసులే చెబుతున్నారన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్వార్టర్సులో జెఏసి భేటీ అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ రైలు రోకోను ఈ నెల 15, 16, 17కు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రభుత్వం హింసవైపు మళ్లించే ప్రయత్నాలు చేయడం సరికాదని సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామారావు వేరుగా అన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ధర్నాలు చేస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పచ్చి అవకాశవాదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని తెలంగాణ వారిని రెచ్చగొట్టేలా మాట్లాడాని మంత్రి టిజి వెంకటేష్, రేణుకా చౌదరి తదితరులపై కేసులు ఎందుకు పెట్టరన్నారు. తెలంగాణ మంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఎందుకు ఉహసంహరించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications