సమ్మెలో అరెస్టయితే నో బెయిల్ ఇక కోర్టుకే?

అయితే, ఇప్పుడు ప్రభుత్వం స్వరం మారింది. గొంతులో ధృఢత్వం చోటు చేసుకుంటున్నది. దానితో, దినేశ్ వైఖరిలో కూడా మార్పు వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడేవారిని ఇక ఉపేక్షించవద్దని ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో, ఇకపై నమోదయ్యే కేసులు ఎటువంటివైనా, నిందితులను రిమాండ్‌కు పంపాలని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. నెల రోజుల సకల జనుల సమ్మెలో తెలంగాణ వ్యాప్తంగా చాలా కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఐపీసీ సెక్షన్ల కింద అరెస్టయిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేవారు. ఇక ముందు ఆ విధంగా స్టేషన్ బెయిల్ ఇవ్వరని తెలుస్తోంది. ఇకపై కచ్చితంగా రిమాండుకు పంపించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చాక ఆందోళనకారుల పట్ల కఠినంగా వ్వవహరిస్తామని ప్రకటించారు కూడా.












Click it and Unblock the Notifications