కెసిఆర్‌తో విభేదిస్తున్న తెలంగాణ రాములమ్మ

తమను కాంగ్రెసు పార్టీవారు అవమానిస్తున్నారని, తన పార్టీని, తన అధ్యక్షుడిని కాంగ్రెసు పార్టీవారు అవమానిస్తుంటే రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని, అయితే కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందనే విశ్వాసం లేదని ఆమె అన్నారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని, అలా ఉంటే మీడియాను పిలిచి చెబుతానని ఆమె చెప్పారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీపై తనకు గౌవరం ఉందని, ఆద్వానీ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె చెప్పారు. తాను బిజెపిలో ఉన్నానని, ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశానని, తెరాసలోకి వచ్చానని, తాను జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడుతున్నానని, ఆ బాధ తనకు ఉందని, ఇలా ఎన్నాళ్లు కాంగ్రెసును నమ్ముకుంటూ పోతామని ఆమె అన్నారు.
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ దాటవేసే పనినే పెట్టుకుందని, తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసుకు లేదని ఆమె అన్నారు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. డిజిపి దినేష్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. దమ్ముంటే తెలంగాణ ఇస్తారో, లేదో కాంగ్రెసు నాయకత్వం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తనకైతే కాంగ్రెసు నాయకులు మోసం చేస్తారనే అనిపిస్తోందని విజయశాంతి అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ కోసం ఢిల్లీ వెళ్లారని, వారు అవమానిస్తుంటే మనం ఎందుకు వారితో మాట్లాడాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications