అన్నాహజారే మద్దతుదారులపై శ్రీరాం సేన మరోసారి దాడి

కాగా బుధవారం ప్రశాంత్ భూషణ్ పైన శ్రీరాం సేన్ కార్యకర్తలు ముగ్గురు దాడి చేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్ పైన ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వారు ఆయనపై దాడి చేశారు. సుప్రీం కోర్టులోని ఆయన ఛాంబరులోకి అపాయింటుమెంటు ఉందని చెప్పి ప్రవేశించిన ముగ్గురు ఆయనను తీవ్రంగా కొట్టారు. అందులో ఇద్దరు పారిపోగా ఒకరిని అప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రశాంత్ భూషణ్‌పై దాడి చేసిన వారికి కోర్టు ఒకరోజు జ్యూడిషియల్ కస్టడీ విధించింది.












Click it and Unblock the Notifications