వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్పను, గాలిని రక్షించే చర్యలు మొదలు

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూర్: లోకాయుక్త తప్పు పట్టిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను, ఇతర మంత్రులను రక్షించే చర్యలకు కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ చర్యలు ప్రారంభించారు. మంత్రులకు ఉద్వాసన చెప్పాలని చేసిన సిఫార్సుపై స్పష్టత కావాలని లోకాయుక్తకు తిరిగి నివేదికను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి లోకాయుక్త సంతోష్ హెగ్డే యడ్యూరప్పను, మంత్రులను తప్పించాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, ఆయన అనుచరుడు శ్రీరాములు కూడా మంత్రి పదవులకు దూరం కావాల్సి వచ్చింది.

ముఖ్యమంత్రి, మంత్రుల ఉద్వాసనకు సిఫార్సు చేసిన లోకాయుక్త సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని సదానంద గౌడ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం అభిప్రాయపడింది. నివేదికను తిరిగి లోకాయుక్తకు పంపాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేను లేదా మంత్రిని తప్పించాలని సూచించడం పౌర మృతికి ఆదేశించడం వంటిదని సమావేశానంతరం న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎస్ సురేష్ కుమార్ మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను తప్పు పట్టిన వ్యక్తులను విచారించకుండానే లోకాయుక్త నివేదిక సమర్పించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆయన అన్నారు.

English summary
In a move seen as an attempt to bail out former chief minister B S Yeddyurappa and other ministers indicted in the Lokayukta report on illegal mining, the BJP government on Thursday decided to seek "clarifications" from Lokayukta on its recommendations over removal of ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X