కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంకు కెసిఆర్ కూతురు వార్నింగ్, ఈటెలకు బెయిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha
కరీంనగర్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెకిలి చేష్టలు మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం హెచ్చరించారు. ఆమె కరీంనగర్ జిల్లాలో తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ను కరీంనగర్ జైలులో ఉదయం బెయిలు రాకముందు కలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈటెలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా మధ్యాహ్నం రైల్వే కోర్టు ఈటెల రాజేందర్‌కు బెయిలు మంజూరు చేసింది.

ఈటెల తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు గత శనివారం కరీంనగర్ జిల్లాలోని ఉప్పల్ రైలు రోకోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయనపై కమలాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. ఆయనకు నాలుగు రోజులుగా బెయిల్ రాలేదు. చివరకు బుధవారం బెయిల్ వచ్చింది. అరెస్టయినప్పటి నుండి ఆయన జైలులోనే ఉన్నారు.

ఈటెలకు బెయిల్ రాకముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి కూడా ఈటెలకు బెయిల్ ఇవ్వకుంటే సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గురువారం ముఖ్యమంత్రి, డిజిపి దిష్టిబొమ్మల దహనాలకు పిలుపునిచ్చారు.

English summary
TRS chief KCR daughter Kalvakuntla Kavitha warned CM Kiran Kumar Reddy today after met TRSLP Etela Rajender at Karimnagar jail. After that railway court issued bail to Etela.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X