తెలంగాణ సకల జనుల సమ్మె: ఎన్ఎంయులో చీలిక

సంఘాన్ని గురువారం రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సాధించాలనే ఆకాంక్షతో చేస్తున్న సమ్మెకు ఇటీవల వారు తూట్లు పొడిచారని తెలంగాణ ఆర్టీసీ నేతలు ఎన్ఎంయు అగ్రనేతలపై విరుచుకు పడ్డారు. వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యమకార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలతో పాటు 8 తీర్మానాలను చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నుంచి తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు చెందాల్సిన వాటాపై పోరాడనున్నట్లు శపథం చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ సకలజనుల సమ్మెలో ఉద్యమాన్ని భుజస్కందాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆర్టీసీ టీ-ఎన్ఎంయూ కార్మికులదేనని పేర్కొన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంఘం పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన కొనియాడారు.












Click it and Unblock the Notifications