ఒంటరి మహిళపై సైకో దాడి, ఆసుపత్రికి తరలింపు

మరోవైపు విశాఖ జిల్లాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు శవమై తేలి కనిపించాడు. నక్కపల్లి మండలం యువకుడిని పలువురు అపహరించారు. అతనిని హతమార్చి పోలవరం కాలువలో పడేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో విద్యార్థినిని వేధించిన ఓ ప్రయివేటు అధ్యాపకునికి దేహశుద్ధి చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో తమకు స్కాలర్ షిప్ మంజూరు ఆలస్యమవుతుందని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు ఓరియంటల్ కళాశాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఒక విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications