తెలంగాణ కోసం జైలుకెళ్లేందుకు సిద్ధం: గుత్తా

Gutta Sekhender Reddy and Poonam Prabhakar
హైదరాబాద్: తెలంగాణ కోసం తాము జైలుకెళ్లడానికైనా సిద్ధమని తెలంగాణ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం అన్నారు. తెలంగాణ కాంగ్రెసు మంత్రులు, పార్లమెంటు సభ్యులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యులు, మంత్రులు, ఎంపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఎప్పుడూ వెనకబడలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము పూర్తి వ్యతిరేకమని అయితే ప్రస్తుత డిజైన్ మార్చితే ఫరవాలేదన్నారు. ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవని చిన్న చిన్న ఆనకట్టలు కడితే లాభదాయకంగా ఉంటుందన్నారు. నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నామన్నారు. మంత్రులు కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

హైదరాబాదులో విశాలాంధ్ర మహాసభకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. విశాలాంధ్ర పేరుతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్ట వద్దని కోరారు. అనుమతి నిరాకరించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఏం చేయాలో అందరం చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకు వస్తున్నామన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు విభజన ఎందుకు వద్దో కారణం చెప్పడం లేదన్నారు. వారు తమ అభ్యంతరాలను స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+