ఎమ్మెల్సీ సీటుకు డి శ్రీనివాస్ ఎంపిక వెనక...

D Srinivas
హైదరాబాద్: కె. రోశయ్య గవర్నర్‌గా వెళ్లడం వల్ల ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటును మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు కేటాయించడం వెనక కాంగ్రెసు అధిష్టానం ఆలోచన ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో డిఎస్ పాత్రను కీలకంగా మార్చే ఉద్దేశంతోనే ఆ ఎంపిక జరిగినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకూడదన్న పార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టి డీఎస్‌ను శాసనమండలికి పంపాలని అధిష్టానం నిర్ణయించింది.. డీఎస్ ఎంపిక వెనుక పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతం నుంచి సీనియర్ నేత అయిన డీఎస్, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవడం వెనుక కీలక పాత్ర పోషించారు.

తెలంగాణపై తాము రూపొందించే ఫార్ములా సాఫీగా అమలు జరిగేందుకు డీఎస్ సంధానకర్తగా వ్యవహరించగలరని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యులు వ్యతిరేకించినప్పటికీ హైకమాండ్ డీఎస్‌ను ఎంచుకోవడానికి కారణం ఇదేనని సమాచారం. డీఎస్ ఎంపిక నేపథ్యంలో తెలంగాణపై హైకమాండ్ ప్రకటన కూడా త్వరలో వెలువడవచ్చని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, బొత్స సత్యనారాయణలతో పాటు సీనియర్ అయిన డిఎస్ సేవలను కూడా వాడుకోవడానికి వీలుగానే డిఎస్‌ను మండలికి ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+