తెలంగాణలో చాన్నాళ్ల తర్వాత చంద్రబాబుకు అవకాశం

దీంతో ఇన్నాళ్లూ నిస్తేజంగా కనిపించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అనుకున్నదే తడవుగా తెలంగాణ టిడిపి నేతలను ఆదేశించారట. అనుకోని విధంగా కలిసి వచ్చిన పోలవరం టెండర్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి టిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ సెంటిమెంటును అడ్డు పెట్టుకుంటున్నదని తెలియజెప్పాలని సూచించారట. వచ్చిన అవకాశాన్ని ఇప్పుడే ఉపయోగించుకోవాలని తద్వారా తెలంగాణలో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలని బాబు నేతలకు సూచించారట. ఇన్నాళ్లూ రాని అవకాశం ఇప్పుడు రావడంతో తెలంగాణ నేతలు సైతం క్యాడర్‌లో ఉత్సాహం నింపడానికి ఈ నెల 28 నుండి జిల్లాల్లో తెలంగాణ సాధనా సభలు ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణకు నష్టం చేసే పోలవరం ప్రాజెక్టును బయటకు వ్యతిరేకిస్తూనే లోలోన టిఆర్ఎస్ తనకు అనుకూలురైన వారికి టెండర్లు దక్కేలా చేసిందనే ఆరోపణలతో ప్రజల ముందుకు వెళ్లడానికి టిటిడిపి నేతలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పోలవరం టెండర్లపై మూడు నెలలుగా స్పందించని టిఆర్ఎస్ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము ఆధారాలు బయట పెట్టిన తర్వాత స్పందించడాన్ని వారు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏం చేశారంటున్నారు. దీనిపై టిఆర్ఎస్ వద్ద సమాధానం లేదని వారు భావిస్తున్నారు. దీంతో రాజకీయ ప్రయోజనాల కోసమే టిఆర్ఎస్ సెంటిమెంట్ వాడుకుంటుందనే భావన ప్రజల్లోకి బలంగా తీసుకు పోవాలని వారు భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీని కాపాడుకోవడానికి టిడిపి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. గతంలో అందరూ రాజీనామాలు చేసినప్పటికీ తామే మొదట రాజీనామాలు చేశామని చెబుతూ ప్రజల్లోకి బస్సుయాత్ర ద్వారా వెళ్లారు.












Click it and Unblock the Notifications