గాలికి స్పెషల్ క్లాస్ ఖైదీ స్థాయి వద్దు: సిబిఐ వాదన

గాలి జనార్దన్ రెడ్డి సామాన్య కానిస్టేబుల్ కుమారుడని, అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించారని, అందువల్ల ప్రత్యేక ఖైదీగా గాలిని గుర్తించాల్సిన అవసరం లేదని సిబిఐ వాదించింది. సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజుకు వర్తించే నిబంధనలు గాలి జనార్దన్ రెడ్డికి వర్తించవని సిబిఐ అభిప్రాయపడింది. కాగా, గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో సిబిఐ స్వాధీనం చేసుకున్న నగదును తమకు అప్పగించాలని కోరుతూ ఐటి శాఖ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి 120 కోట్ల రూపాయల ఆదాయం పన్ను బాకీ పడ్డారని, అందువల్ల సిబిఐ స్వాధీనం చేసుకున్న నగదును తమకు అప్పగిస్తే దాన్ని భర్తీ చేసుకుంటామని ఐటి శాఖ అన్నది.












Click it and Unblock the Notifications