సీమాంధ్ర నేతలకు సిగ్గు లేదు: కేశవరావు కామెంట్

తెలంగాణకు సీమాంధ్ర నేతలు ఎందుకు అడ్డు పడుతున్నారని, సిగ్గు లేదా అని ఆయన సిమాంధ్ర నేతలను అడిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హింస జరగవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం ఎవరితోనైనా కలుస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవడం త్యాగం కాదని ఆయన అన్నారు. దేశంలో 1956 తర్వాత 17 రాష్ట్రాలు ఏర్పడ్డాయని, వాటికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ విషయంలోనే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ఆయన అన్నారు. ఆ రాష్ట్రాలు ఇచ్చేప్పుడు జరగని జాప్యం తెలంగాణ విషయంలోనే ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications