జగన్ ఎప్పుడూ వెళ్లలేదు: రోజా, ఎల్లో మీడియాపై ధ్వజం

ఎల్లో మీడియా, కాంగ్రెసు అనవసరంగా జగన్ అభిమానులను రెచ్చగొట్టవద్దన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే ఎన్నికలకు సిద్ధం కావాలని అప్పుడు జగన్ బలమెంతో తెలుస్తుందన్నారు. తమ నేతను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఎల్లో మీడియా గందర గోళ సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. సరైన సమాచారం ఉంటేనే చెప్పాలని సూచించారు. దివంగత వైయస్ చరిష్మాతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు ఆయన మరణం తర్వాత ఆయనను క్రిమినల్‌గా చూపిస్తున్నారన్నారు. జగన్ పార్టీ వీడి బయటకు వెళ్లిన తర్వాత ఉద్దేశ్య పూర్వకంగా ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వేధింపులతో జగన్‌పై ప్రజలకు అభిమానం రెట్టింపవుతుందన్నారు.












Click it and Unblock the Notifications