గాలి జనార్దన్ రెడ్డి ఏది చెప్తే అదేనంటున్న శ్రీరాములు

బళ్లారి నుంచి పోటీ చేయాలని బిజెపి పరిశీలకుడు రఘునాథ రావు మల్కాపురే ఆదివారం శ్రీరాములుకు సూచించారు. గాలి జనార్దన్ రెడ్డి అంగీకరిస్తేనే తాను పోటీ చేస్తానని శ్రీరాములు నిక్కచ్చిగా చెప్పారు. మల్కాపురేతో శ్రీరాములు ఆదివారంనాడు రెండు గంటల పాటు చర్చించారు. గాలి జనార్దన్ రెడ్డి నిర్ణయం మేరకే తాను పోటీ చేసేది, లేనిది ఉంటుందని శ్రీరాములు భేటీ అనంతరం చెప్పారు. బిజెపి టికెట్‌పై పోటీ చేయాలా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా అనేది ప్రస్తుతం శ్రీరాములు ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు గాలి జనార్దన్ రెడ్డి సమాధానం చెప్తారు.
ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. యడ్యూరప్పను కలుపుకోవడం వల్ల బలమైన లింగాయత్‌ల మద్దతు దొరుకుతుందనేది ఆయన ఆలోచన. బిజెపితో తెగదెంపులు చేసుకుని కొత్త పార్టీ పెడతారా, లేదా అనేది శ్రీరాములు బళ్లారిలో పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డిని పార్టీ నాయకులు పరామర్శించకపోవడం పట్ల శ్రీరాములు మల్కపురే వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications