ప్రభుత్వంపై రైతులు తిరగబడ్తారు: చంద్రబాబు

Chandrababu Naidu
విజయవాడ: ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నాైరు. ప్రభుత్వం రైతు సమస్యలపై ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో రైతు పోరు బాట నిర్వహించేందుకు విజయవాడ నుంచి బయలుదేరే ముందు ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, వ్యవసాయం మీద ఆధారపిడన ప్రతి ఒక్కరు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. వ్యవసాయంపై ఆధారపడినవారిని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. పోరు బాటలో తనకు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. రైతుల్లో చైతన్యం తెచ్చి భవిష్యత్తులో పెద్ద యెత్తున ఉద్యమించేందుకు సమాయత్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకు తాను రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లాలో రైతు పోరు బాట నిర్వహించిన చంద్రబాబు రాత్రి విజయవాడలో బస చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+