బాబుకు షాక్: తెరాసలోకి మరో నలుగురు ఎమ్మెల్యేలు

తెలుగుదేశం పార్టీకి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా శాసనసభ్యులు పి. రాములు, జైపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు హనుమంతరావు షిండే, కరీంనగర్ జిల్లాకు చెందిన సుద్దాల దేవయ్య తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణపై చంద్రబాబు అనుసరిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతంతో తమ తమ నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి నెలకొనడంతో వారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా, నల్లగొండ జిల్లా భువనగిరి శాసనసభ్యురాలు ఉమా మాధవరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన మోత్కుపల్లి నర్సింహులుకు పార్టీలో ప్రాధాన్యం పెరగడం, తనపై వివక్ష ప్రదర్శించడం వంటి కారణాలతో పాటు తెలంగాణ అంశం కూడా ఆమెను ఆలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ నుంచి కూడా తెరాసలోకి మరిన్ని వలసలు ఉంటాయని చెబుతున్నారు. షాద్‌నగర్ శాసనసభ్యుడు ప్రతాప రెడ్డి వంటి వారు తెరాస వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications