చేతులు మారనున్న టీవీ9, జాతీయ మీడియా చేతికి

ఒప్పందం కుదిరితే కొత్త యాజమాన్యం వినోద ప్రసారాల చానెల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీవీ9 తెలుగు సహా వివిధ భాషట్లో వార్తా చానెళ్లను నడుపుతోంది. హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎబిసిఎల్) దేశవ్యాప్తంగా టీవీ9 పేర ప్రాంతీయ వార్తాచానెళ్లను నడుపుతోంది. శ్రీనివాస రాజు 2004లో ఎబిసిఎల్‌ను స్థాపించారు. పశ్చిమ భాజరత దేశానికి చెందిన ఓ మీడియా సంస్థతో పాటు మరో సంస్థ ఐల్యాబ్స్ షేర్లను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీవీ9లో ఐల్యాబ్స్‌కు 60 శాతం ఈక్విటీ ఉంది.
ఎబిసిఎల్‌తో సంబంధాలను పెట్టుకోవుడానికి కొంత మేరకు ఈక్విటీని ఐల్యాబ్స్ ఉంచకుంటుందా, పూర్తి ఈక్విటీని విక్రయిస్తుందా అనేది తెలియడం లేదు. ప్రమోటర్స్‌కు 20 శాతం వాటా మాత్రమే ఉంది. ఎబిసిఎల్ ప్రస్తుతం ఏడు ప్రాంతీయ చానెళ్లను నడుపుతోంది. వాటిలో రెండు తెలుగులో, ఒకటి కన్నడంలో, కర్ణాటకలో ఆంగ్లంలో, గుజరాత్, మహారాష్ట్రల్లో ఒక్కటేసి చానెళ్లను నడుపుతోంది.












Click it and Unblock the Notifications