వైయస్ జగన్‌కు సెబి చిక్కులు?: ఈనాడు అటాక్

Eenadu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబి) నుంచి కూడా దర్యాఫ్తు తాఖీదులు అందుకునే అవకాశం లేకపోలేదని ఈనాడు కథనం ప్రచురించింది. ఇప్పటికే కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం గనుల కేసులో సిబిఐ ముందు హాజరైన జగన్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) నుండి సమన్లు అందుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సహారా గ్రూపు కేసు తరహాలోనే సాక్షిని నడుపుతున్న జగతి పబ్లికేషన్స్ పైనా సెబి దర్యాఫ్తు చేపట్టే అవకాశముందని కార్పోరేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారని పత్రిక కథనం ప్రచురించింది.

తాము కేవలం అంతర్గత అవసరాలకు మాత్రమే వాడుకుంటామని జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డి కోరటంతో తాము జగతి పబ్లికేషన్ విలువను రూ.3500కోట్లుగా వేసి ఇచ్చామని అంతేకాకుండా నివేదిక కోరింది 2008 ఏప్రిల్‌లో అయితే 2007 నవంబర్ తేదీ వేసివ్వమని కోరటంతో అలాగే వేసిచ్చామని ఇటీవలె అంతర్జాతీయ సంస్థ డెలాయిటీ ప్రతినిధి సుదర్శన్ సిబిఐ ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే ఇలా కంపెనీకి సంబంధించిన అంతర్గత పత్రాలను మదుపుదార్లకు ఇచ్చి, వారి నుండి భారీగా పెట్టుబడులు సేకరించడమంటే ప్రాస్పెక్టస్ జారీ చేసినట్లు, తద్వారా పబ్లిక్ ఇష్యూ చేసినట్లే అవుతుందని సహారా గ్రూపు వ్యవహారంలో కూడా సెబి నిర్ధారించిందని పేర్కొంది. అలాగే కార్పోరేట్ వర్గాల సమాచారం ప్రకారం యాబై మందికంటే ఎక్కువ మంది నుంచి పెట్టుబడులు స్వీకరించాలంటే సెబి అనుమతి ఉండాలని చెప్పింది.

సాక్షిలో దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు, సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. సెబి అనుమతులు లేకుండా ఇలా పెద్దసంఖ్యలో బయటి నుంచి పెట్టుబడులు సేకరించడం, డెలాయిట్ నుంచి కేవలం అంతర్గత అవసరాల కోసమేనని తెచ్చుకున్న సంస్థాగత విలువ నివేదికను పెట్టుబడులు సమీకరించుకునేందుకు వాడుకోవడం ఇవన్నీ సెబి నిబంధన ఉల్లంఘనలే అవుతాయని సహారా - సెబి కేసును ప్రస్తావిస్తూ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారని పేర్కోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+