జైల్లో గాలిని కలిసిన మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి

తనను చూడడానికి వచ్చినందుకు గాలి జనార్దన్ రెడ్డి ప్రతాప రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను అధికారికంగా తనిఖీకి వచ్చానని, వ్యక్తిగతంగా రాలేదని మంత్రి చెప్పారు. ఎలా ఉన్నారు, ఇక్కడి జీవితానికి సర్దుబాటు అయ్యారా అని ప్రతాప రెడ్డి గాలి జనార్దన్ రెడ్డిని అడిగినట్లు చెబుతున్నారు. మీ తండ్రి, ఏరాసు అయ్యపురెడ్డి జీవించి ఉంటే తనకు ఈ గతి పట్టేది కాదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారని చెబుతున్నారు. తొంబై రోజుల తర్వాత బెయిల్ వస్తుందని ఆశిస్తున్నట్లు గాలి జనార్దన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రతాప రెడ్డి జైలులో తనిఖీలు నిర్వహించి, కొందరు ఖైదీలను కూడా కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications