గంటల తరబడి ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని ప్రశ్నించిన సిబిఐ

ప్రస్తుతం వస్తున్న వార్తాకథనాల ప్రకారం - కేంద్ర అనుమతితోనే గంగమ్మ కొండను గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి లీజుకు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. 2007లో గాలి జనార్దన్ రెడ్డికి గనులను లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. దాన్ని లీజుకు ఇవ్వాలని అప్పటి గనుల మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్ రెండు సార్లు సిఫార్సు చేశారని ఆమె అన్నారు. నాన్ నోటిఫైడ్ ఏరియాలో గనులను లీజుకు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. గనుల అక్రమ తవ్వకాల కేసులో సిబిఐ ఇప్పటికే ఐఎఎస్ అధికారి రాజగోపాల్‌ను అరెస్టు చేసింది. శ్రీలక్ష్మిని కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. శ్రీలక్ష్మిని గురువారం సిబిఐ అధికారులు 9 గంటల పాటు విచారించారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆమె సిబిఐ అధికారులతో చెప్పినట్లు సమాచారం. సిఫార్సుల మేరకే తాను పనిచేశానని, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తీవ్రంగా ఉండిందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డికి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందని ఆమె సిబిఐ అధికారులతో అన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మనీ లాండరింగ్ కేసులో జగతి పబ్లికేషన్స్ వైయస్ చైర్మన్ విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ముందు హాజరయ్యారు. ఈడి అడిగిన పత్రాలను అందించారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఈ నెల 28వ తేదీలోగా స్వయంగా గానీ, ఆయన ప్రతినిధులు గానీ తమ ముందు హాజరు కావాలని ఈడి జగన్‌కు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications