బాబుకు మద్దతివ్వండి: టి-మంత్రులకు హరీష్ రావు

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులను మళ్లించారని ఆయన ఆరోపించారు. ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే టిఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు. బాబుకు తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా మద్దతిస్తే కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ఇస్తుందని సూచించారు. కాంగ్రెసు, టిడిపి రెండూ తెలంగాణ ద్రోహులే అన్నారు.












Click it and Unblock the Notifications