చంద్రబాబు అవిశ్వాస తీర్మానంపై జగన్ సాక్షి విసుర్లు

గత అసెంబ్లీ సమావేశాల్లోనూ టిడిపి నిబంధనలకు విరుద్దంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చి హడావుడి చేసి అబాసుపాలయ్యిందన్నారు. టిడిపి గత సమావేశాల్లో కావాలనే అవిశ్వాస నోటీసుల విషయంలో తప్పటడుగులు వేసి ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పారని విమర్శించింది. అవిశ్వాసమంటూ టిడిపి నేతలు మీడియా సమావేశాల్లో బీరాలు పలుకుతున్నప్పటికీ తూతూ మంత్రపు ఎత్తుగడతో వెళ్లడానికి రంగం సిద్ధం చేశారని చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలవలేమని, బాబుపై సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెసు ప్రభుత్వంతో సఖ్యత చెడగొట్టకుండా తమకు అనుకూలంగా ఉపయోగించుకొవాలని టిడిపి చూస్తోందని విమర్శించింది.












Click it and Unblock the Notifications