ప్రత్యేక తెలంగాణ ఇది వరకే ప్రకటించారు: కెసిఆర్

మనోభావాలను గౌరవించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రధానికి తాను మరోసారి అప్పీలు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీ భూస్థాపితం కాక తప్పదన్నారు. తెలంగాణను గతంలోనే ప్రకటించారని దానిని ఆలస్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. యుపి ముఖ్యమంత్రి మాయావతి నిర్ణయం దేశానికే ఆదర్శ ప్రాయమని, ఆమె నిర్ణయం స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో మా గళానికి బిఎస్పీ ఎంపీలు తోడవుతారన్నారు. ఢిల్లీ వెళ్లాకమాయావతిని కలుస్తానన్నారు.
మాయావతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాదులో అన్నారు. కెటిఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెసు తీరుపై విరుచుకు పడ్డారు. మాయావతి మాదిరి సిఎం కిరణ్ కూడా తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపించాలన్నారు.












Click it and Unblock the Notifications