తెలంగాణపై తీర్మానం చేయండి: కాంగ్రెసుకు మాయా

mayavathi
లక్నో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు మాట్లాడలేదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి సోమవారం లక్నోలో అన్నారు. ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని మూజువాణి ఓటు ద్వారా యుపి అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. దీనిని భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ వ్యతిరేకించాయి. తీర్మానం అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. రాష్ట్ర విభజన రాజకీయ స్వలాభం కోసం మాయ వేసిన ఎత్తుగడ అని బిజెపి, సమాజ్ వాదీ పార్టీలు ధ్వజమెత్తాయి.

అనంతరం మాయావతి మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వానిది ఎన్నికల తీర్మానం కాదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే విభజన తీర్మానం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడమంటే మైనార్టీ, దళితుల అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. సభలో గందరగోళ పరిస్థితికి విపక్షాలే కారణమన్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ అంశం పైనా స్పందించారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేశారని వారి రాజీనామాలు స్పీకర్ వద్ద ఇప్పటికీ పెండింగులో ఉన్నాయని అన్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే స్పీకర్ తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ కోసం ఎపి అసెంబ్లీ ఎలాంటి తీర్మానం చేయలేదని అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక రాష్ట్ర
ఏర్పాటును ఆలస్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెసు తీర్మానం చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+