విలీనం లేఖ ఇవ్వండి: చిరంజీవికి సిఎం కిరణ్ సూచన

వచ్చే శాసనసభ సమావేశాలలో టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు చాలా తక్కువ అని పెట్టినప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చిరుతో సిఎం చెప్పారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో వెళ్లిన ఎమ్మెల్యేలు కొందరు తనతో టచ్‌లో ఉన్న విషయాన్ని చిరుకు చెప్పారు. తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని సిఎంను చిరు కోరారు. టిడిపి ఎమ్మెల్యేలే ఉన్న చోట పిఆర్పీ నేతలకూ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా చిరు కోరారు.
కాగా చిరంజీవి కుమారుడు, సినీ హీరో రాంచరణ్ వివాహం కామినేని ఉపాసనతో జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం జీవీకే ఫామ్‌హౌస్‌లో జరగనుంది.తన ఢిల్లీ పర్యటన విశేషాలను సీఎంతో పంచుకున్నారు. చిరుతో పాటు గంటా శ్రీనివాస్ రావు తదితరులు సిఎంను కలిశారు.












Click it and Unblock the Notifications