కాంగ్రెసు, టిడిపిలే లక్ష్యంగా తెలంగాణ పోరు: కోదండరామ్

ఉత్తరప్రదేశ్ విభజనకు మాయావతి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిన విధంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పూనుకుని తెలంగాణ కోసం శాసనసభలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండుతో డిసెంబర్ 1వ తేదీన తెలంగాణలోని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తన హామీని నిలబెట్టుకోనందుకు నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు లేఖ రాస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ ఆత్మగౌరవ దినంగా పాటిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications