చర్చల తర్వాతే: తెలంగాణపై పెదవి విప్పిన సోనియా

కాగా బుధవారం కూడా ఎంపీలు తెలంగాణకు అనుకూలంగా లోకసభలో ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే ధరలు, తెలంగాణ అంశాలతో దద్దరిల్లింది. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది. అనంతరం పన్నెండు గంటలకు రెండు సభలు ప్రారంభమైనప్పటికీ గందరగోళం చెలరేగడంతో లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లు సభలను గురువారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications