ఫేస్‌బుక్ జూకర్స్‌కు ధాయ్‌లాండ్ ప్రభుత్వం వార్నింగ్

ఈ సంధర్బంలో ధాయ్ సమాచార, సాంకేతిక మంత్రి అనిధుత్ మాట్లాడుతూ ఫేస్‌బుక్ యూజర్స్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సమాచారాన్ని డిలిట్ చేయకపొతే యూజర్స్ ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. గత వారంలో ధాయ్‌లాండ్ రాణిపై అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపినటువంటి 61 సంవత్సరాలు వయసు కలిగిన ముసలి వ్యక్తికి 20 సంవత్సరాలు జైలు శిక్షను ధాయ్ ప్రభుత్వం ఖరారు చేసిన సంఘటనను కూడా ఫేస్‌బుక్ యూజర్స్‌కు గుర్తు చేశారు.
అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో రాయల్ ప్యామిలీపై వచ్చిన అన్ని రకాల కంటెంట్‌కి, మేసేజ్‌లకు, ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్ బర్గ్ భాద్యత వహించాల్సి ఉంటుందని ఇంటర్యూలో తెలిపారు. దీనిపై ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్ బర్గ్ తక్షణమే స్పందించి, రాయల్ ప్యామిలీకి సంబంధించిన అన్ని రకాల మేసేజ్‌లను పూర్తిగా తొలగించాల్సిందిగా కొరడం జరిగింది.












Click it and Unblock the Notifications