రిటైల్ మార్కెట్లో ఎఫ్‌డిఐపై దద్ధరిల్లిన పార్లమెంటు

ఎన్‌డిఎ మిత్రపక్షం జెడి (యు) సోమవారం లోకసభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. వామపక్షాలు, అన్నాడియంకె కూడా చర్చకు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి, నినాదాలు చేయడంతో లోకసభను స్పీకర్ మీరా కుమార్, రాజ్యసభను చైర్మన్ హమీద్ అన్సారీ వాయిదా వేశారు. యుపిఎ భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెసు పార్టీ కూడా రిటైల్ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తోంది.
తిరిగి సమావేశమైన తర్వాత కూడా పార్లమెంటు ఉభయసభల్లో పరిస్థితి మారలేదు. ఎఫ్‌డిఐ అంశంపై ప్రతిపక్షాలు తక్షణ చర్చకు పట్టుబట్టి ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయ సభలకు రేపటికి వాయిదా పడ్డాయి. లోకసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలంగాణ అంశంపై ఆందోళనకు దిగారు. పార్లమెంటు సమావేశాలు స్తంభిస్తున్న నేపథ్యంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications