కర్ణాటకలో గాలి అనుచరుడు శ్రీరాములు కొత్త పార్టీ

Sreeramulu
బెంగళూర్: కర్ణాటకలో తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బి. శ్రీరాములు ప్రకటించారు. పార్టీ నుంచి ఆరుగురు ప్రజాప్రతినిధులను బిజెపి నాకయత్వం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయన సోమవారం ఆ ప్రకటన చేశారు. కొంత మంది బిజెపి శాసనసభ్యులు తమ పార్టీలో చేరుతారని, గాలి జనార్దన్ రెడ్డి జైలు నుంచి వచ్చాక పార్టీకి పూర్తి రూపురేఖలు వస్తాయని ఆయన ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. బిజెపికి రాజీనామా చేసి బళ్లారి రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

తన పార్టీ శాసనసభ్యులు ఇతర పార్టీలకు వెళ్లకుండా బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్ప కాపాడుకోవాలని, తన పార్టీ తలుపులను భద్రపరుచకోవాలని ఆయన అన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పలువురు శాసనసభ్యులు, ప్రజలకు తనకు మద్దతిస్తున్నారని ఆయన అన్నారు. బళ్లారిలో నవంబర్ 6వ తేదీన ఎన్నికల ర్యాలీని తన మద్దతుదారులు అడ్డుకోవడంపై ఆయన ప్రతిపక్ష కాంగ్రెసు నేత సిద్ధరామయ్యకు ఆయన క్షమాపణలు చెప్పారు. నవంబర్ 25వ తేదీన బిజెపి నాయకత్వం ఇద్దరు పార్లమెంటు సభ్యులను, నలుగురు శాసనసభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శ్రీరాములుకు మద్దతు తెలిపినందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+