అవిశ్వాసంపై వైఖరేంటి: జగన్,కెసిఆర్‌లకు మోత్కుపల్లి

mothkupalli narsimhulu
హైదరాబాద్: అవిశ్వాసంపై మీ వైఖరేంటో చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావులను ప్రశ్నించారు. మోత్కుపల్లి, గాలి మద్దుకృష్ణమ నాయుడు తదితర టిడిపి నేతలు మధ్యాహ్నం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. అవిశ్వాసం తదితరాలపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వచ్చే శాసనసభ సమావేశాల మొదటి రోజునే తాము కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇస్తామన్నారు. జగన్, టిఆర్ఎస్ తమకు మద్దతిస్తారో లేదో చూడాలన్నారు.

కెసిఆర్ కాంగ్రెసు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెండోసారి రాజీనామా ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. దళితుడైన రాజయ్యచే రాజీనామా చేయించారని ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామాల ఆమోదంపై తమకు అనుమానాలున్నాయని అన్నారు.

వచ్చే శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రజా సమస్యల విషయంలో అవిశ్వాసం పెడతామని మరోనేత గాలి ముద్దుకృష్ణమ అన్నారు. కరవు నివారణపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. కరవుపై కేంద్రానికి ప్రభుత్వం ఒక్క నివేదిక కూడా పంపలేదని విమర్శించారు. రాజీనామాల ఆమోదంపై గల సందేహాలను స్పీకర్‌కు తెలిపినట్లు చెప్పారు. కరవు, రైతు సమస్యలపై చర్చించేందుకు సమయాన్ని పెంచాలని తాము స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+