శ్రీలక్ష్మికి ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు

విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేయరాదని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించకూడదని సిబిఐ కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. హృద్రోగి కావడంతో ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని సిబిఐ కోర్టు శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరు కావడం గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఓ మలుపు అనే చెప్పవచ్చు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఈ నెల 3వ తేదీలోగా సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. శ్రీలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు నుంచి విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications