శ్రీలక్ష్మి పిటిషన్‌పై విచారణ వాయిదా, రాజశేఖర్ అరెస్టు

కాగా, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) డైరెక్టర్ రాజశేఖర్‌ను సిబిఐ అధికారులు శుక్రవారం కర్ణాటకలో బళ్లారిలో అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాదు తరలిస్తున్నట్లు సమాచారం. రాజశేఖర్ గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి రాజగోపాల్ బావమరిది. రాజశేఖర్‌ను సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. రాజశేఖర్ అరెస్టుతో గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఇప్పటి వరకు సిబిఐ అరెస్టు చేసినవారి సంఖ్య ఐదుకు చేరుకుంది.












Click it and Unblock the Notifications