నలుగురు కుటుంబ సభ్యులూ వైద్యులే, ఆత్మహత్య

Doctors Family Suicide
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో వైద్యుల కుటుంబం యావత్తూ ఆత్మహత్య చేసుకున్న దయనీయ సంఘటన చోటు చేసుకుంది. నలుగురు కుటుంబ సభ్యులు అప్పుల బాధతో అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పేదల వైద్యుడిని ఎవరూ ఆదుకోలేకపోయారు.

వివరాలు ఇలా ఉన్నాయి - చామరాజపేట, వాల్మీకినగర్‌కు చెందిన డాక్టర్ అమానుల్లా ఖాన్(60) ఇక్కడి ఋదికేరి నర్సింగ్ హోంను నిర్వహిస్తున్నారు. భార్య డాక్టర్ హమీదా భాను(50)తో కలిసి శ్యామణ్ణగార్డెన్‌లో లిమ్రా నర్సింగ్ హోం, విజయనగర్‌లోని మరో క్లినిక్‌ను కూడా చూసుకుంటున్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ స్థానికంగా ఈ వైద్య దంపతులు మంచి పేరు తెచ్చుకున్నారు. వీరి పెద్ద కుమారుడు ఫయాజ్ ఖాన్ రషీద్(28) ఎంబీబీఎస్ పూర్తిచేయగా రెండో కుమారుడు హఫా రషీద్(26) కూడా డాక్టర్ కోర్సు ఆఖరు సంవత్సరం చదువుతున్నాడు.

పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకున్న అమానుల్లా వారి చదువు కోసం భారీగా అప్పు చేశాడు. ఓ నర్సింగ్ హోం కొనుగోలుతో అది మరింత పెరిగింది. అప్పులు తీర్చడానికి మరిన్ని రుణాలు తీసుకుంటూ వెళ్లాడు. ఇలా దాదాపు రూ.5కోట్ల మేర అప్పుల్లో మునిగిపోయాడు. దీంతో బ్యాంకులు, రుణదాతల నుంచి క్రమంగా ఒత్తిడి పెరిగింది. దిక్కుతోచని స్థితిలో గురువారం రాత్రి సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. విషం ఇంజక్షన్‌తో కుటుంబంలోని నలుగురూ ప్రాణం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఋదికేర్ నర్సింగ్ హోంకి వచ్చిన నర్సుకు వారంతా విగతజీవులుగా కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+